అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- July 02, 2026
అమెరికా నౌకాదళానికి చెందిన ఒక శక్తివంతమైన యుద్ధ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నావికాదళంలో ఎంతో కీలకమైన ‘ఎంహెచ్-60ఎస్ సీహాక్’ రకానికి చెందిన ఈ హెలికాప్టర్ బుధవారం (జూలై 1) ప్రమాదానికి గురైనట్లు అమెరికా రక్షణ వర్గాలు ధృవీకరించాయి. అమెరికాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్) ‘యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్’ పరిధిలో ఈ హెలికాప్టర్ తన విధులను నిర్వహిస్తోంది.
ముగ్గురు సిబ్బంది సురక్షితం..మరొకరి కోసం వేట
ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో మొత్తం నలుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన నావికాదళ రెస్క్యూ బృందాలు ముగ్గురిని ప్రాణాలతో కాపాడాయి. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని, వారికి ‘యూఎస్ఎస్ జార్జ్ బుష్’ యుద్ధనౌకపైనే అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, హెలికాప్టర్ లోని మరో సిబ్బంది సముద్రంలో కొట్టుకుపోయారు. గల్లంతైన ఆ వ్యక్తి కోసం అమెరికా నావికాదళ నౌకలు, ప్రత్యేక విమానాలు అరేబియా సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
శత్రువుల దాడి కాదు..సాంకేతిక లోపమే కారణం!
పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అమెరికా తన నౌకాదళాన్ని అరేబియా సముద్ర పరిసరాల్లో మోహరించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిన ఈ ప్రమాదంపై ‘యూఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్’ క్లారిటీ ఇచ్చింది. ఇది శత్రుదేశాల దాడి వల్ల జరిగిన ఘటన కాదని ప్రాథమికంగా స్పష్టం చేసింది. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక సమస్యే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నామని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని నావికాదళం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







