'పినాక' అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
- July 02, 2026
గోల్డెన్ మెగాస్టార్ గణేష్ పుట్టినరోజు సందర్భంగా 'పినాక' చిత్ర నిర్మాతలు సినిమాలోని ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక ఆకట్టుకునే కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఒక పురాతన రహస్యాన్ని ఛేదించడంలో నిమగ్నమైన గణేష్‌ను ఒక ప్రత్యేకమైన గెటప్ లో చూపిస్తున్న ఈ పోస్టర్, సాహసం, పురాణాలు, రహస్యాలు, అద్భుతాలతో నిండిన ఒక సినిమా ప్రయాణమైన 'పినాక' సారాంశాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ఈ ఈ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సందర్భంగా చిత్రబృందం గోల్డెన్ మెగా స్టార్ గణేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పినాక’లో ఆయనను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూడబోతున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశారు.
అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుందని ప్రకటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బి. ధనంజయ దర్శకత్వం వహిస్తున్నారు.
తారాగణం: గోల్డెన్ మెగాస్టార్ గణేష్
సిబ్బంది:
రచన - దర్శకత్వం : ధనంజయ
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సంగీతం: గౌర హరి
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
ఎడిటింగ్: సాయిబాబు తలారి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







