ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- July 02, 2026
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10వ షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు తమ సర్వీసును మరో రెండేళ్ల పాటు కొనసాగించవచ్చు. వారం క్రితమే దీనిపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికీ ఈ నిబంధన వర్తిస్తుంది. తద్వారా అనేక విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ పొందిన ఉద్యోగులు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. పరిపాలన పరంగా కూడా స్థిరత్వం పెరుగుతుందని భావిస్తున్నారు.
అలాగే 60 ఏళ్ల వయస్సులో ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకూ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగంలో చేరే మధ్య గ్యాప్ కాలానికి జీతభత్యాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, వారు తిరిగి సర్వీసులో జాయిన్ అయ్యాక పూర్తి స్థాయి సర్వీసు బెనిఫిట్స్ వర్తిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయంతో 15వేల మందికి లబ్ధి చేకూరనుంది.
కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగంలో లేని కాలాన్ని కూడా సీనియారిటీ లెక్కల్లో పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారికి ప్రత్యేక నిబంధనలు వర్తించనున్నాయి. మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటే వారికి రెగ్యులర్ రిటైర్మెంట్ విధానాన్నే అందుబాటులో ఉంటుంది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు







