దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- July 02, 2026
దుబాయ్: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గంభీర్‌పూర్‌కు చెందిన రమేష్ దుబాయ్‌లో ఫోటోగ్రఫీ రంగంలో రెండు దశాబ్దాల అనుభవంతో విజయవంతంగా రాణిస్తున్నారు. లెమన్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలను అందిస్తూ మంచి గుర్తింపు పొందారు.
రమేష్ 2020లో దుబాయ్‌లో లెమన్ స్టూడియో తొలి బ్రాంచ్‌ను ప్రారంభించారు. అనంతరం బర్ దుబాయ్‌లోని అల్ హమ్రియా ప్రాంతంలోని గో ఫ్రెష్ మార్కెట్‌లో, బాబు మోషాయ్ రెస్టారెంట్ సమీపంలో రెండో బ్రాంచ్‌ను ఏర్పాటు చేసి సేవలను విస్తరించారు.
రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు పాల్గొని స్టూడియోను ప్రారంభించారు. రమేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫోటోగ్రఫీ రంగంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
లెమన్ స్టూడియో ద్వారా ఇండోర్, అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలను అందిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ముఖ్యంగా సెలబ్రిటీ ఫోటోగ్రఫీలో తమకు ప్రత్యేక నైపుణ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక పరికరాలు, సృజనాత్మక శైలితో వివాహాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్ , కార్పొరేట్ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక వేడుకలను నాణ్యమైన చిత్రాలు, వీడియోల రూపంలో అందించడం తమ లక్ష్యమని రమేష్ తెలిపారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించడమే తమ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







