జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- July 03, 2026
విజయవాడ: జర్మనీలో ఉద్యోగం చేయాలనుకునే నైపుణ్యం కలిగిన యువతకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో కీలక అవకాశాన్ని కల్పిస్తోంది. నైపుణ్య శిక్షణతో పాటు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా నర్సులు, ఫిజియోథెరపిస్టులు, వెల్డర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు సంబంధిత రంగంలో ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని అధికారులు తెలిపారు.
జర్మనీలో ఉద్యోగానికి అవసరమైన జర్మన్ భాషా శిక్షణను A1, A2, B1 స్థాయిల వరకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా అందించనున్నారు. శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జర్మనీలో ప్లేస్మెంట్ సపోర్ట్ కల్పించడంతో పాటు కెరీర్ అభివృద్ధికి నిపుణుల మార్గదర్శకత్వం కూడా అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 8, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 9, 2026న ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ నైపుణ్యం (Naipunyam) పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







