పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’
- July 04, 2026
మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు చేస్తుంటారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రఖ్యాత చిత్రం ‘ వారణాసి’ లో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’.
విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నిస్సాం బషీర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతు తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అత్యంత ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఉత్కంఠభరితమైన కథ, వేగవంతమైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది.
ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు జీవితంలో అనూహ్యంగా జరిగిన సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు అతను నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానమే ‘ఐ, నోబడీ’.
భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా రూపొందింది. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు తమ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించనుండగా, దర్శకుడు నిస్సాం బషీర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: నిస్సాం బషీర్, కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్ , సంగీతం: జేక్స్ బిజాయ్, నిర్మాతలు: ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







