'ఓ..! సుకుమారి' నుంచి ‘ప్రేమ ప్రేమిస్తున్నా’ సాంగ్ రిలీజ్
- July 05, 2026
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. జూలై 17న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో చిత్రం నుంచి ‘ప్రేమ.. ప్రేమిస్తున్నా’ అనే రొమాంటిక్, మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటను జేమ్స్ టకారా ఆలపించారు. పూర్ణాచారి లిరిక్స్ ఎంతో చక్కగా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విలేజ్ వాతావరణం, హీరో హీరోయిన్ ట్రాక్, సింపుల్ కొరియోగ్రాఫీ పాటను అందంగా మలిచింది.
రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
ఫైట్స్ : అంజి
కొరియోగ్రఫీ: జెడి మాస్టర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







