వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ క్రేజీ పోస్టర్ అవుట్
- July 05, 2026
నందమూరి నందనవనపు వారసుడు, వైవిధ్యభరిత చిత్రాల కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే బహుమతిని అందించింది. విక్టరీ వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (#VenkyAnil5) నుంచి అదిరిపోయే స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ పూర్తి సంప్రదాయబద్ధమైన పంచెకట్టు గెటప్‌లో పక్కా లోకల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
నా మొదటి హీరో, బెస్ట్ బడ్డీ.. అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు.
2027 సంక్రాంతి బరిలోకి విక్టరీ-నందమూరి కాంబో!
పోస్టర్‌తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించే మరో సంచలన ప్రకటనను అనిల్ రావిపూడి అధికారికంగా ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి (Sankranthi 2027) కానుకగా థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన ‘పటాస్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, దీనికి తోడు బాక్సాఫీస్ సీనియర్ కింగ్ విక్టరీ వెంకటేష్ కూడా తోడవడంతో ఈ చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







