ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- July 05, 2026
మస్కట్: రహదారి వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడానికి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది. వాహనాల విండో టింటింగ్‌ను నియంత్రించే నిబంధనలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రహదారి భద్రతా అవసరాలకు అనుగుణంగా టింట్ పరిమితులను పునరుద్ఘాటించింది.
వాహనం ముందు విండ్‌షీల్డ్ మినహా, వాహనాల విండోలకు టింట్ వేయవచ్చు. ముందు విండ్‌షీల్డ్‌కు టింట్ వేయడానికి అనుమతి లేదు. మిగిలిన వాహన విండోలకు గరిష్టంగా అనుమతించదగిన టింట్ స్థాయి 50 శాతం.
ఫ్యాక్టరీలోనే అమర్చిన టింటెడ్ సైడ్ విండోలు ఉన్న వాహనాలకు కూడా అనుమతి ఉందని, అయితే ఆ గ్లాస్ కనీసం 30 శాతం లైట్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉండాలని ROP పేర్కొంది. అలాగే, వాహనదారులు మ్యాట్ (నాన్-గ్లాస్) వెహికల్ ర్యాప్‌లు లేదా పెయింట్ ఫినిషింగ్లను ఉపయోగించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







