సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- July 05, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఎంపిక చేసిన వ్యాపారాలకు 24 గంటల నిర్వహణ అనుమతి పొందడానికి అవసరమైన రుసుము నుండి మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ మరియు హౌజింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేశాయి. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండే ఇంధన కేంద్రాలు, సేవా కేంద్రాలు, అలాగే హోటళ్లు, హోటల్ అపార్ట్‌మెంట్లు, రిసార్ట్‌లు మినహాయింపు పొందే కేటగిరీల్లో ఉన్నాయి.
అదే విధంగా.. ఫార్మసీలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్యా సంస్థలు, వివాహ మందిరాలు మరియు వినోద విశ్రాంతి గృహాలకు కూడా ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం, అర్ధరాత్రి నుండి ఉదయం 5 గంటల మధ్య జరిగే వ్యాపార కార్యకలాపాలకు 24 గంటల అనుమతి వర్తిస్తుంది. రమదాన్ పవిత్ర మాసంలో లేదా ఈద్ సెలవు దినాల్లో ఈ ఆంక్షలు వర్తించవని ప్రకటించారు.
కాగా, అనుమతించిన ఉద్యోగుల షిఫ్టులకు సంబంధించిన నియమాలను తాము నిర్దేశిస్తామని, అదే సమయంలో నివాస ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు, అర్హతగల వ్యాపారాలు పనిచేయగల వీధులను, ప్రదేశాలను పురపాలక సంఘాలు నిర్దేశిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







