రావు బహదూర్ తెలుగు సినిమాకి రిఫరెన్స్ పాయింట్ అవుతుంది: నాగచైతన్య
- July 05, 2026
సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'రావు బహదూర్'. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని ఘన విజయంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
తాజాగా 'రావు బహదూర్' చిత్రాన్ని వీక్షించిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్రబృందాన్ని కలిసి తన అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ..."చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒరిజినల్ సినిమా 'రావు బహదూర్'. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే చాలా ధైర్యం కావాలి. నిజంగా ఇలాంటి పాత్ర ఒక నటుడికి రావడం అదృష్టం. ఆ పాత్ర మనకు రాలేదని ప్రతి నటుడు కొంచెం అసూయపడతాడు. సత్యదేవ్ చాలా అద్భుతమైన నటన కనబరిచారు. ఇది ఒక మాస్టర్‌క్లాస్ లాంటి సినిమా. నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. ఇందులోని ప్రతి డీటైల్ కట్టిపడేసింది. 'రావు బహదూర్' ప్రపంచాన్ని వెంకటేష్ మహా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.
మలయాళంలో అంత గొప్ప సినిమా తీశారు, కన్నడలో అలాంటి సినిమా తీశారు అని మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు తెలుగులో కూడా వెంకటేష్ మహా రావు బహదూర్ రూపంలో అలాంటి కంటెంట్ రిచ్ సినిమాను తీసుకొచ్చారు.
ఈ సినిమాపై రివ్యూలు ఏమన్నారు, ఫ్రెండ్స్ ఏమన్నారు అని చూడడం కంటే ప్రేక్షకులు స్వయంగా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయాలి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాను నిర్మించడం కూడా ఎంతో ధైర్యంతో కూడుకున్న విషయం. ఈ సినిమాకు ఎలాంటి రిఫరెన్స్ పాయింట్ లేదు. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఎలాంటి ఫార్ములాలను అనుసరించకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇంత మంచి సినిమా అందించిన చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినిమాకు 'రావు బహదూర్' ఒక రిఫరెన్స్ పాయింట్ అవుతుంది''.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







