ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- July 08, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఫిన్లాండ్లోని ప్రముఖ పరిశ్రమల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆటో బాడీ రిపేర్, వెల్డింగ్, మెటల్ వర్క్స్ తదితర రంగాల్లో అనుభవం ఉన్న వారికి ఈ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ నియామకాల ద్వారా ఆటో బాడీ టెక్నీషియన్లు (ప్యానెల్ బీటర్లు), స్ట్రక్చరల్ బాడీ రిపేర్ స్పెషలిస్టులు, MIG & TIG వెల్డర్లు, షిప్‌బిల్డింగ్ మరియు హెవీ ఫ్యాబ్రికేషన్ వెల్డర్లు, మెటల్ వర్కర్లుతో పాటు ఇతర నైపుణ్య పారిశ్రామిక విభాగాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అనుభవం, పనితీరు ఆధారంగా నెలకు €3,600 నుంచి €4,800 వరకు స్థూల వేతనం అందించనున్నారు. వారానికి 40 గంటల పని ఉంటుంది. ఉద్యోగ స్థలం ఫిన్లాండ్‌గా పేర్కొన్నారు.
అభ్యర్థులు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఐటీఐ లేదా డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ముఖ్యంగా MIG వెల్డింగ్ నైపుణ్యం తప్పనిసరి. ఆటో బాడీ రిపేర్, స్ట్రక్చరల్ రిపేర్, ప్యానెల్ బీటింగ్ లేదా సంబంధిత పారిశ్రామిక రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకునే వారు అప్డేటెడ్ సీవీ, గతంలో చేసిన పనులకు సంబంధించిన ఫొటోలు, ప్రాక్టికల్ పని అనుభవానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల నమోదు జూలై 12, 2026 వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించాలని ఏపీఎస్ఎస్డీసీ సూచించింది.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







