'మైసా' కోసం రష్మిక రిస్కీ స్టంట్స్
- July 10, 2026
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె కెరీర్లోనే అత్యంత సవాల్ తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచగా, ఇప్పుడు రష్మిక చేస్తున్న రిస్కీ స్టంట్స్ మరింత అంచనాలని పెంచుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండ్ గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారు.
తాజాగా ఈ సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలను రష్మిక స్వయంగా చేశారు. రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. భారతీయ సినీ చరిత్రలో ఓ కథానాయిక స్వయంగా చేసిన మొట్టమొదటి అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదే.
ఈ సన్నివేశం కోసం బాడీ డబుల్‌ను ఉపయోగించకుండా, స్వయంగా నటించాలని రష్మిక నిర్ణయించుకున్నారు. సన్నివేశాల్లో సహజత్వం కోసం ఆమె చూపించిన ఈ అంకితభావం సినిమా టెక్నికల్ టీమ్‌తో పాటు అండర్‌వాటర్ యాక్షన్ టీమ్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ అండర్‌వాటర్ ఎపిసోడ్ కేవలం యాక్షన్ సీన్ మాత్రమే కాదు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశం సినిమాలోనే అత్యంత ఆకట్టుకునే విజువల్ హైలైట్‌గా నిలవనుంది.
ఈ చిత్రంలో రాహుల్ రవీంద్ర, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి. కృష్ణ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఖాంఫక్డీ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక ఈ సినిమా కోసం పడుతున్న కష్టం చూస్తుంటే 'మైసా' లో ఆమెను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్ లో చూడబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
తారాగణం: రష్మిక మందన్న, రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె
నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డిఓపి: శ్రేయాస్ పి కృష్ణ
స్టంట్స్: కేచ ఖంఫక్డీ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







