25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- July 11, 2026
కేరళ నుంచి జగిత్యాలకు చేరుకున్న మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీకి ప్రశంసలు
జగిత్యాల: పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తిరిగి చెల్లించేందుకు కేరళ నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జగిత్యాల జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తి నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఘటన సమాజంలో ఇంకా మానవత్వం, స్నేహానికి ఉన్న విలువను మరోసారి చాటింది.
కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో పనిచేస్తున్న సమయంలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న వద్ద రూ.25 వేల అప్పు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడంతో సంబంధాలు తెగిపోయాయి.
అయితే, ఎన్నేళ్లు గడిచినా అప్పు తీర్చాలనే సంకల్పాన్ని వదల్లేదు. ఇటీవల లచ్చన్నను వెతికేందుకు కేరళ నుంచి తెలంగాణకు వచ్చిన ఇస్మాయిల్‌కు లచ్చన్న చిరునామా, ఫోన్ నంబర్ ఏవీ అందుబాటులో లేకపోయినా, గూగుల్ మ్యాప్స్ మరియు స్థానికుల సహాయంతో ధర్మపురిలోని ఆయన ఇంటిని గుర్తించాడు.
ప్రస్తుతం లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుసుకున్న ఇస్మాయిల్, ఆయనతో ఫోన్లో మాట్లాడి తన వద్ద ఉన్న రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న లచ్చన్న, 25 ఏళ్ల తర్వాత కూడా తన అప్పు తీర్చేందుకు ఇంత దూరం ప్రయాణించి వచ్చిన స్నేహితుడు మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీని అభినందించారు. డబ్బు కంటే స్నేహం, విశ్వాసానికి ఆయన ఇచ్చిన విలువ ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఈ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. కాలం మారినా నిజాయితీ, మానవత్వం, స్నేహబంధాలకు విలువ తగ్గలేదని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







