అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- July 11, 2026
దోహా: అమెరికాలో నేరారోపణలు ఎదుర్కొంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ ఆసియా వ్యక్తిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. లెఖ్వియా (Lekhwiya) సెక్యూరిట ఫోర్సెస్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), అలాగే ఇంటర్‌పోల్ (INTERPOL) సహకారంతో చేపట్టిన సంయుక్త భద్రతా ఆపరేషన్‌లో భాగంగా ఆసియా దేశానికి చెందిన ఒక వాంటెడ్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
సదరు వ్యక్తిపై అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే క్రిమినల్ ముఠాలకు సంబంధించిన పలు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
నేరగాళ్ల అప్పగించ కార్యక్రమం అంతర్జాతీయ భద్రతా సహకారం, మిత్రదేశాలతో సమన్వయానికి నిదర్శనమని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో విశ్వసనీయ భాగస్వామిగా ఖతార్ తన స్థానాన్ని మరింత బలోపేతం అవుతుందని, అలాగే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు మద్దతు అందించేందుకు దేశీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు మరియు అమల్లో ఉన్న న్యాయ విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







