కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- July 12, 2026
కువైట్ : కింగ్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రోడ్డు (రోడ్ నంబర్ 50) పై భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రోడ్డు మెయింటెనెన్స్ కారణంగా ఈ మార్గంలోని కుడి మరియు మధ్య లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
థర్డ్ రింగ్ రోడ్ ఎగ్జిట్ (ఖాల్దియా ప్రాంతానికి ఎదురుగా) నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గం నుంచి ఫోర్త్ రింగ్ రోడ్డుకు దారితీసే ఎగ్జిట్ వరకు ఈ మూసివేత ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించారు. దీంతో పాటు, ఖాల్దియా ప్రాంతంలోని రియాద్ రోడ్డుపై ఉన్న సలీం బిన్ అలీ బుఖ్మాజ్ స్ట్రీట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్లను కూడా తాత్కాలికంగా మూసివేయనున్నారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మరియు ప్రయాణ ఆలస్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ సూచికలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







