యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- July 13, 2026
మనామా: హోర్ముజ్ జలసంధి మూసివేత, సముద్ర-విమాన రవాణా మార్గాల అంతరాయం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న బహ్రెయిన్ దిగుమతులు మళ్లీ కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా మూడు నెలల్లో సుమారు BD694 మిలియన్ల విలువైన దిగుమతుల లోటు ఏర్పడినప్పటికీ, ఏప్రిల్, మే నెలల్లో వాణిజ్యం క్రమంగా పుంజుకుందని అధికారిక గణంకాలు వెల్లడించాయి.
మార్చిలో దిగుమతులు BD221.1 మిలియన్లకు పడిపోగా, ఏప్రిల్‌లో అవి BD287.7 మిలియన్లకు, మేలో BD373.2 మిలియన్లకు చేరాయి. మార్చితో పోలిస్తే మే నాటికి దిగుమతులు దాదాపు 69 శాతం పెరిగాయి. సముద్ర రవాణా మార్గాలు తిరిగి తెరుచుకోవడం, సరుకు రవాణా సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ వృద్ధి నమోదైంది. అయితే మే నెల దిగుమతులు యుద్ధానికి ముందు జనవరి, ఫిబ్రవరిలో నమోదైన సగటు స్థాయితో పోలిస్తే ఇంకా 29 శాతం తక్కువగానే ఉన్నాయి.
చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతులకు భారీ దెబ్బ
సముద్ర మార్గాలపై ఆధారపడిన దేశాల నుంచి దిగుమతులు తీవ్రంగా తగ్గాయి. చైనా నుంచి 57.4 శాతం, ఆస్ట్రేలియా నుంచి 81.6 శాతం, జపాన్ నుంచి 69.9 శాతం, అమెరికా నుంచి 50.9 శాతం, యూఏఈ నుంచి 35.2 శాతం దిగుమతులు తగ్గాయి. అయితే సౌదీ అరేబియా నుంచి దిగుమతులు మాత్రం 18.2 శాతం పెరిగాయి. కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా రోడ్డు మార్గంలో సరుకుల రవాణా కొనసాగడంతో బహ్రెయిన్‌కు అవసరమైన వస్తువుల సరఫరా కొనసాగింది.
పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
యుద్ధ ప్రభావం భారీ పరిశ్రమలపై ఎక్కువగా పడింది. వాహనాలు, విడిభాగాల దిగుమతులు 72.8 శాతం, ముడి పదార్థాలు, లోహాలు 74.9 శాతం, ఖనిజ ఇంధనాలు, చమురు ఉత్పత్తులు 62.5 శాతం తగ్గాయి. యంత్రాల దిగుమతులు 54.4 శాతం, విద్యుత్ పరికరాలు 40.1 శాతం క్షీణించాయి. ఇనుప ఖనిజం దిగుమతులు 75.3 శాతం పడిపోగా, అల్యూమినియం తయారీలో కీలకమైన అల్యూమినియం ఆక్సైడ్ దిగుమతులు 52 శాతానికి పైగా తగ్గాయి. విమాన ఇంజిన్ విడిభాగాల దిగుమతులు కూడా 78.2 శాతం క్షీణించాయి.
నిలకడగా వైద్య రంగం
పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వైద్య రంగానికి సంబంధించిన సరఫరాలు పెద్దగా ప్రభావితం కాలేదు. రిటైల్ ఔషధాల దిగుమతులు 29.7 శాతం, ప్రయోగశాల రియాజెంట్ల దిగుమతులు 46.2 శాతం పెరిగాయి. దీంతో రవాణా అంతరాయాల మధ్య కూడా ఆరోగ్యరంగానికి అవసరమైన ఔషధాలు, వైద్య సామగ్రి సరఫరా నిరంతరంగా కొనసాగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







