దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- July 13, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటైన దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వేను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న రహదారికి నాలుగు కొత్త లేన్లు జోడించనుండటంతో వాహనాల రాకపోక సామర్థ్యం గణనీయంగా పెAరగనుంది.
ఈ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం కావడంతో రియాద్ మరియు ఈస్టర్న్ ప్రావిన్స్ మధ్య అనుసంధానం బలోపేతం కానుంది.
ప్రాజెక్టు ద్వారా కీలక మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంతో పాటు దేశంలోని లాజిస్టిక్స్ నెట్వర్క్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ విస్తరణ పనులు సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా చేపడుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమని అధికారులు పేర్కొన్నారు. రహదారి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్య రవాణా, ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతాయని వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







