హైదరాబాద్ లులు మాల్‌లో గన్ కలకలం
- July 14, 2026
హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్‌లో ఓ వ్యక్తి గన్‌తో కనిపించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెబుతుండగా పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్‌ను పోలీసులు గుర్తించారు.
సిద్దిఖీ దగ్గర గన్ కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. కాగా గన్‌కు చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే గన్‌తో వచ్చిన వ్యక్తిని మాల్‌లోకి అనుమతించడంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు సీరియస్ అయ్యారు. మాల్‌లోకి ప్రవేశించేప్పుడు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే సదరు వ్యక్తి గన్‌తో లోపలికి రాగలిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







