భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- July 14, 2026
మనామా: 2026 తొలి ఐదు నెలల్లో భారత్ నుంచి బహ్రెయిన్‌కు 111.19 మిలియన్ బహ్రెయిన్ దినార్ (BD) విలువైన వస్తువులు దిగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో మొత్తం సుమారు 282 మిలియన్ కిలోల సరుకులు భారత్ నుంచి బహ్రెయిన్‌కు చేరాయి.
మొత్తం దిగుమతుల్లో అల్యూమినా విలువ, పరిమాణం పరంగా అగ్రస్థానంలో నిలిచింది. అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఈ ముడి పదార్థాన్ని బహ్రెయిన్ BD11.86 మిలియన్ల విలువతో, 67.2 మిలియన్ కిలోలకు పైగా దిగుమతి చేసుకుంది.
అన్రాట్ అల్యూమినియం (Unwrought Aluminium) దిగుమతులు BD6.16 మిలియన్లు కాగా, వాటి బరువు 4.87 మిలియన్ కిలోలు. అనంతరం అల్యూమినియం వైర్ BD6.12 మిలియన్ల విలువతో, 4.74 మిలియన్ కిలోల పరిమాణంలో దిగుమతి అయింది.
సెమీ-ఫినిష్డ్ ఇనుము, ఉక్కు ఉత్పత్తులు BD5.14 మిలియన్ల విలువతో, 33.12 మిలియన్ కిలోలు దిగుమతి అయ్యాయి. ఫ్రోజన్ బీఫ్ దిగుమతుల విలువ BD4.15 మిలియన్లు, 2.08 మిలియన్ కిలోలకు పైగా నమోదైంది.
అదే విధంగా కాస్ట్-ఐరన్ పైపులు, ట్యూబులు BD3.19 మిలియన్ల విలువతో, 14.59 మిలియన్ కిలోల పరిమాణంలో దిగుమతి అయ్యాయి.
బంగారు ఆభరణాలు మాత్రం తక్కువ బరువుతో అధిక విలువ కలిగిన దిగుమతులుగా నిలిచాయి. కేవలం 46 కిలోల బంగారు ఆభరణాల విలువ BD1.86 మిలియన్లుగా నమోదైంది.
ఇక మెడిసిన్స్ BD1.77 మిలియన్ల విలువతో, 90,500 కిలోల బరువుతో దిగుమతి కాగా, 1,501 సీసీ నుంచి 3,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లు BD1.56 మిలియన్ల విలువతో, 3.64 లక్షల కిలోల బరువుతో భారత్ నుంచి బహ్రెయిన్‌కు దిగుమతి అయినట్లు గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







