అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- July 16, 2026
కువైట్ సిటీ: సీఎన్‌బీసీ అరేబియా ప్రకటించిన 2026 టాప్-100 సీఈఓల జాబితాలో కువైట్‌కు చెందిన ఎనిమిది మంది ప్రముఖ వ్యాపార నేతలు చోటు దక్కించుకున్నారు. వారి సమర్థ నాయకత్వం, సంస్థల ఆర్థిక పురోగతి, సరికొత్త ఆవిష్కరణలు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది.
ఈ జాబితాలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK) సీఈఓ ఇస్సామ్ అల్-సాగర్, కువైట్ ఫైనాన్స్ హౌస్ (KFH) సీఈఓ ఖాలిద్ అల్-షమ్లాన్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) సీఈఓ ఎల్హామ్ మహ్‌ఫౌజ్, జైన్ గ్రూప్ వైస్ చైర్మన్, గ్రూప్ సీఈఓ బదర్ అల్-ఖరాఫీ, బోర్సా కువైట్ సీఈఓ మొహమ్మద్ అల్-ఒసైమీ, జజీరా ఎయిర్‌వేస్ సీఈఓ భరతన్ పసుపతి, మబానీ సీఈఓ వలీద్ అల్-షురాయాన్, అజిలిటీ చైర్‌పర్సన్ హనాది అల్-సాలెహ్ చోటు దక్కించుకున్నారు.
సీఎన్‌బీసీ అరేబియా తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థల ఆర్థిక పనితీరు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, వినూత్నత, కార్పొరేట్ గవర్నెన్స్, సుస్థిర అభివృద్ధి వంటి ఐదు ప్రధాన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు.
ఈ ఏడాది టాప్-100 జాబితాలో బ్యాంకింగ్, పెట్టుబడులు, ఇంధనం, టెక్నాలజీ, ఏఐ, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగం, రిటైల్, లాజిస్టిక్స్, టెలికమ్యూనికేషన్స్, మ్యానుపాక్చరింగ్, ఏవియేషన్, ఫిన్‌టెక్ తదితర 11 కీలక రంగాలకు చెందిన బిజినెస్ లీడర్లు చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







