ఆ చిన్నారి తల్లి కోసం అండగా నిలబడ్డ అనిల్ రావిపూడి..
- July 17, 2026
మన సెలబ్రిటీలు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి అపుడప్పుడు సాయం చేస్తారని తెలిసిందే. తాజాగా అనిల్ రావిపూడి ఓ చిన్నారి తల్లి కోసం సాయం చేసారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా డ్రామా జూనియర్స్ అనే టీవీ షో చేస్తునం సంగతి తెలిసిందే. ఆ షోలో అనేక మంది చిన్నారులు తమ స్కిట్స్ తో నవ్విస్తారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో అనిల్ రావిపూడి, శ్రీకాంత్, రోజా జడ్జీలుగా ఉండగా సుధీర్ ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు.
ఈ షోలో శ్రీవియా అనే చిన్నారి సరదాగా అనిల్ రావిపూడిని తమ్ముడు అని పిలుస్తూ నవ్విస్తుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీవియా స్కిట్ అయిన తర్వాత సుధీర్ ఈ విషయం తెలిపాడు. ఆ చిన్నారి తల్లి షూటింగ్ కి రాలేదని, ఇటీవల యాక్సిడెంట్ కు గురైందని, రెండు కాళ్ళు బాగా దెబ్బ తిన్నాయని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని అనిల్ రావిపూడి ఆమె హాస్పిటల్ ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చు భరించినట్లు తెలిపారు.
తల్లి గురించి మాట్లాడటంటంతో ఆ చిన్నారి ఏడ్చేసింది. దీంతో అనిల్ రావిపూడి పక్కన అమ్మ లేకపోయినా నీ తమ్ముడు నేను ఉన్నా కదా అంటూ ఆ చిన్నారికి ధైర్యం చెప్పి నవ్వించారు. దీంతో అనిల్ రావిపూడి చేసిన సాయానికి ఆయన్ని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







