మషాల పీతల వేపుడు
- August 13, 2016
కావలసిన పదార్దములు :
పీతలు : అరకిలోటమాటాలు : రెండు కొబ్బరి ముక్కలు : కప్పు గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి )కారం : రెండు టీ స్పూన్లు ఉప్పు : సరిపడా నూనె : కప్పు కొత్తిమీర : చిన్న కట్ట మషాల : అర టీ స్పూన్ దనియాలు : టీ స్పూన్ జీలకర్ర : టీ స్పూన్ పచ్చిమిర్చి : మూడు మిరియాలు : పావు టీ స్పూన్ పసుపు : పావు టీ స్పూన్ కరివేపాకు : రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి.
2) మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి.
3) తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.
5) ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.అంతే మసాలా పీతల వేపుడు రెడీ.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







