'ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ
- July 20, 2026
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇరుముడి పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్, ఆ తర్వాత విడుదల చేసిన తొలి పాట 'ఇరుముడి కట్టు'తో ఆకట్టుకున్నారు. అయ్యప్ప స్వామిపై భక్తి భావాన్ని ఆవిష్కరించిన ఆ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. వీడియోలో "నాకు ఒకే ఒక్క కూతురే... పేరు మనమ్మ" అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తిని మరింత పెంచారు. ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. దీంతో సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే తన మనసుని తాకే సంగీతంతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. అలాగే సినిమా నుంచి రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్‌లోనే అత్యంత ఎమోషనల్, ఇంటెన్సిటీ గల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర వారి కుమార్తె పాత్రను పోషిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







