డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- July 20, 2026
హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ఐకాన్ మహమ్మద్ సిరాజ్ మైదానంలోనే కాకుండా కొత్త బాధ్యతల్లోనూ అదరగొడుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంచే తెలంగాణ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్, ఖాకీ డ్రెస్సులో సరికొత్త అవతారంలో మెరిశారు. కొత్తగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ యూనిఫామ్‌లో సిరాజ్ డీజీపీని కలిసిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రజల సేవలో సఫలీకృతులు కావాలని ఆకాంక్ష.. ప్రశంసల జల్లు!
డీజీపీ సీవీ ఆనంద్‌తో భేటీకి సంబంధించిన వివరాలను, ఫోటోలను మహమ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో డీజీపీ నిరంతరం విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత పతాకాన్ని ఎగరేసిన మైదానపు వీరుడు, ఇప్పుడు డీఎస్పీ హోదాలో ఖాకీ దుస్తుల్లో కనిపించడం పట్ల ఆయన అభిమానులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సేవ చేయడంలోనూ, కొత్త బాధ్యతలను నిర్వర్తించడంలోనూ సిరాజ్ యువతకు ఆదర్శంగా నిలిచారని అభినందనలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి







