ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం

- July 20, 2026 , by Maagulf
ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం

దుబాయ్: మిడిల్ ఈస్ట్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్‌లకు వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యూఏఈకి చెందిన పలు విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా తమ సర్వీసుల్లో మార్పులు చేశాయి.

సోమవారం ఒక్కరోజే యూఏఈలో మొత్తం 16 విమానాలు రద్దు కాగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఎతిహాద్ ఎయిర్‌వేస్

కువైట్‌కు వెళ్లే EY653, EY654 విమానాలను జూలై 19, 20 తేదీల్లో ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రకటించింది.

బహ్రెయిన్‌కు వెళ్లే EY641 విమానం విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయడంతో ఆరు గంటలకు పైగా ఆలస్యమైంది. తిరుగు ప్రయాణ విమానం EY642 కూడా ఆలస్యంగా నడిచింది. గత గురువారం కూడా బహ్రెయిన్‌కు వెళ్తున్న ఒక ఎతిహాద్ విమానాన్ని మధ్యలోనే తిరిగి అబుదాబికి మళ్లించారు.

అమెరికాలోని చికాగోకు వెళ్లే EY011 విమానం కూడా ఆపరేషనల్ కారణాలతో ఆలస్యమవగా, తిరుగు ప్రయాణ విమానం EY012 కూడా ఆలస్యంగా నడిచింది.

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్

కువైట్‌కు వెళ్లే EK853, EK855, EK857, EK859 విమానాలను సోమవారం, మంగళవారం రద్దు చేసింది.

బహ్రెయిన్‌లో వైమానిక నావిగేషన్ వ్యవస్థలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో EK835, EK837, EK839 విమానాలు కూడా శనివారం నుంచి రద్దు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఫ్లైదుబాయ్

దుబాయ్ నుంచి బహ్రెయిన్‌కు వెళ్లే FZ021, FZ023, FZ029 విమానాలు సోమవారం రద్దయ్యాయి. ఇందులో FZ029 ఆదివారం కూడా రద్దు కాగా, మిగతా రెండు విమానాలను మంగళవారం నిర్వహించేలా షెడ్యూల్ చేశారు.

ఎయిర్ అరేబియా

కువైట్‌కు వెళ్లే 3L020 విమానం మంగళవారం రద్దు కాగా, G9068, G9124 విమానాలు కూడా సోమవారం, మంగళవారం రద్దయ్యాయి. అయితే కొన్ని ఇతర కువైట్ విమానాలు స్వల్ప ఆలస్యంతో నడుస్తున్నాయి.

బహ్రెయిన్‌కు వెళ్లే 3L015, 3L017 విమానాలు స్వల్ప ఆలస్యంతో నడుస్తున్నప్పటికీ, ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే సేవలు కొనసాగుతున్నాయి.

దోహాకు వెళ్లే G9040, G9130, G9027 విమానాలు సోమవారం, మంగళవారం రద్దయ్యాయి. అయితే G9081, G9135, G9132, G9138 విమానాలు సాధారణంగా నడుస్తున్నట్లు ఎయిర్ అరేబియా తెలిపింది.

ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ సర్వీస్ ద్వారా ముందుగానే తెలుసుకుని విమానాశ్రయానికి రావాలని విమానయాన సంస్థలు సూచించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com