విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- July 21, 2026
అమెరికా: అమెరికాలో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) విధానాన్ని రద్దు చేస్తూ, విద్యార్థుల బసపై గరిష్ఠంగా నాలుగేళ్ల నిర్దిష్ట కాలపరిమితి (Fixed Period of Admission) విధించింది. కొత్త నిబంధనల ప్రకారం కోర్సు కాలపరిమితి లేదా గరిష్ఠంగా 4 సంవత్సరాల వరకు మాత్రమే యుఎస్‌లో ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ పిహెచ్డీ లేదా సుదీర్ఘమైన కోర్సులు చేసేవారు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, యూఎస్‌సిఐఎస్ (USCIS)కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని గడువు పెంపు (Extension of Stay) పొంది, అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 15 డెడ్‌లైన్: పాత విద్యార్థులకు ఊరట
ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపు ఇప్పటికే అమెరికాలో ఉండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులకు మినహాయింపునిచ్చారు; వారు పాత ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నిబంధనల పరిధిలోనే కొనసాగుతారు. అయితే, సెప్టెంబర్ 15 తర్వాత యుఎస్‌లో అడుగుపెట్టే కొత్త విద్యార్థులకు మాత్రం ఈ నాలుగేళ్ల పరిమితి నిబంధన వర్తిస్తుంది. అంతేకాకుండా, కోర్సు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు లేదా ఇతర కేటగిరీకి మారేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!







