స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ ..
- August 13, 2016
తెలుగింటి సీతమ్మగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్న స్నేహ పెళ్ళి తర్వాత కాస్త సినిమాలకు దూరమైంది. గత ఏడాది స్నేహాకు విహాన్ అనే కుమారుడు జన్మించడంతో పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది స్నేహ. మమ్ముట్టి హీరోగా తెరకెక్కనున్న ఓ మలయాళ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారట. ఫ్యామిలీ డ్రామా కమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మమ్ముట్టి భార్యగా స్నేహ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్ర కథ స్నేహకు చాలా నచ్చడంతో వెంటనే ఓకే అనేసిందట. తొలుత ఆ పాత్ర కోసం నయనతారతో పాటు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చిన స్నేహ పర్ ఫెక్ట్ గా సూటవుతారని యూనిట్ ఆమెని సంప్రదించారు. ఈ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







