50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించిన సెక్స్ వర్కర్లు
- August 15, 2016
ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో ఇవి ముగియబోతున్నాయి. దాంతో విదేశీయులను ఆకట్టుకునేందుకు అక్కడున్న దాదాపు 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారట. అయితే ఈసారి మాత్రం తాము అనుకున్న దానికంటే వ్యాపారం చాలా డల్‌గా ఉందని చెబుతున్నారు.రియోలో అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన విలా మిమోసా ప్రాంతం మరకానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వస్తే.. రోడ్డు మీద దోపిడీ దొంగలకు చిక్కుకుపోతామనే భయంతో చాలామంది ఆగిపోతున్నారని తెలిసింది. ఈ నగరంలో ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఏకంగా రెండు వేల హత్యలు జరిగాయి.ప్రస్తుతం ఈ రెడ్‌లైట్ ఏరియాలో ధరలు రూ. 1500 నుంచి రూ. 840కి పడిపోయాయని చెబుతున్నారు. విదేశీయులకు అర్థం అయ్యేందుకు వీలుగా ఇంగ్లీషు, పోర్చుగీసు, ఇతర భాషల్లో కూడా తగ్గింపు ధరలను రాసి పోస్టర్లు వేస్తున్నారు. బ్రెజిల్లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది. అయితే వేశ్యాగృహాలు నడపడం మాత్రం అక్కడ చట్టవిరుద్ధం.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







