స్వీట్ పూరీ.!
- August 15, 2016
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ , కొబ్బరికోరు : కప్పు , పంచదార : కప్పు , జీడిపప్పులు, బాదంపప్పులు, నెయ్యి : టేబుల్ స్పూన్ , యాలుకల పొడి : అర టీ స్పూన్ , నేతిలో వేపిన కేరెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
మైదాను కొద్దిగా నెయ్యి, పంచదార పొడి కలిపి నీళ్ళుపోసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి. జీడిపప్పు, బాదం పప్పులు నేతిలో దోరగా వేపి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి కళాయిపెట్టి పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. తీగపాకం వచ్చాక కొబ్బరి వేసి కలపాలి. ఇది గట్టి పడుతుండగా నేతిలో వేపిన పప్పులు, యాలుకల పొడి వేసి కలిపి దించి చల్లార నివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసి ఒక్కోవుండను పూరీలుగా చేసి కాగే నూనెలో వేసి ఒక నిముషం వేగనిచ్చి తియ్యాలి (మరీ వేగనివ్వగూడదు). ఇప్పుడు ఒకొక్క పూరీలో కొబ్బరి మిశ్రమం పెట్టి ఆచివర ఈచివర మడతపెట్టి విడిపోకుండా లవంగం గుచ్చి, కేరెట్ తురుము జల్లాలి. అంతే స్వీట్ పూరీ రెడి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







