గుండెపై దిగిన కత్తితో వచ్చిన వ్యక్తిని రక్షించిన వైద్యులు
- August 16, 2016
భూమి మీద నూకలు ఉంటే....క్లిష్ట పరిస్థితిలో ఉన్నవారెవరైనా ఎంచక్కా బతికి పోతారనడానికి ఇదో మంచి ఉదాహరణ.... ఒక పోరాట సమయంలో కత్తితో ప్రత్యర్థులతో పొడిపించుకొని గుండెలో ఉండిపోయిన ఒక కత్తితో ఆసుపత్రికి వచ్చిన బాధితుడిని సౌదీ వైద్యులు అనేక గంటల పాటు శస్త్ర చికిత్స జరిపి ఆ వ్యక్తి యొక్క జీవితంను వైద్యులు రక్షించారు..వివరాలలోకి వెళితే, హెయిల్ పట్టణంలో ఇరువురు సౌదీ వ్యక్తుల మధ్య జరిగిన ఒక పోరాటంలో మరో వ్యక్తి ప్రత్యర్థి ఛాతీపై బలంగా కత్తితో పొడిచాడు. దీనితో గాయపడిన వ్యక్తిని రక్తం వొడుకొంటూ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఆస్పత్రికి చేరుకొన్నాడు .కింగ్ ఖలీద్ ఆస్పత్రిలో వైద్యులు ముందుగా గుండె నుంచి స్రవిస్తున్న అధిక రక్తస్రావం నియంత్రించడానికి శస్త్రచికిత్సని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత రోగిని మెరుగైన వైద్యం నిమిత్తం అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి ఇపుడు నిలకడగానే ఉందని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







