అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- August 15, 2026
దోహా: దోహాలోని అల్ సాద్ మెట్రో స్టేషన్ కళా ప్రదర్శనకు వేదికగా మారింది. ఖతార్ మ్యూజియమ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆకట్టుకునే కళా చిత్రాలు (మ్యూరల్స్) ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖతార్ రైల్ ఇటీవల సోషల్ మీడియా పోస్టులో ఈ కళాకృతుల గురించి ప్రస్తావించింది. ప్రయాణికుల రోజువారీ మెట్రో ప్రయాణంలో కళ, సంస్కృతిని పరిచయం చేసేలా వీటిని రూపొందించినట్లు తెలిపింది. రంగురంగుల మ్యూరల్స్‌తో స్టేషన్ పరిసరాలు ఓపెన్-ఎయిర్ ఆర్ట్ గ్యాలరీని తలపిస్తున్నాయి.
ఖతార్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా కళా కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో స్థానిక వారసత్వం, ఆధునిక కళాత్మకత కలగలిసిన అంశాలు కనిపిస్తాయి. ఒక ప్రముఖ చిత్రంలో సంప్రదాయ ఖతారీ దుస్తుల్లో ఉన్న వ్యక్తితో పాటు ఒంటె, గద్దను అరేబియన్ సంప్రదాయ ఆకృతుల మధ్య చిత్రించారు. మరో మ్యూరల్లో పెయింటింగ్ చేస్తున్నట్లు కనిపించే పాత్రలను సరదాగా చిత్రించగా, ఇంకో కళాకృతిలో థోబ్లు ధరించిన వ్యక్తులు పెద్ద గిన్నెల చుట్టూ ఉన్న దృశ్యాన్ని ఆధునిక శైలిలో ఆవిష్కరించారు.
దోహాలోని ప్రజా రవాణా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కళను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోల్డ్ లైన్లో ఉన్న అల్ సాద్ మెట్రో స్టేషన్ 2019 నవంబర్‌లో ప్రారంభమైంది. రద్దీగా ఉండే అల్ సాద్ ప్రాంతంలో కీలక ప్రదేశంలో ఉన్న ఈ స్టేషన్‌లోని కళాకృతులను స్థానికులు, సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







