పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- August 19, 2026
దక్షిణాఫ్రికాలోని సన్ సిటీ వేదికగా జరిగిన వరల్డ్ సబ్-జూనియర్ & జూనియర్ క్లాసిక్ & ఇక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన మోదెం వంశీ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. జూనియర్ 66 కేజీల విభాగంలో పోటీపడిన ఈ యువ అథ్లెట్, ఏకంగా నాలుగు పతకాలు (రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం) గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు.
రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం సాధించిన భద్రాద్రి యోధుడు
స్క్వాట్ విభాగంలో 287.5 కేజీల బరువు ఎత్తి మొదటి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విభాగంలో యూఎస్ఏకి చెందిన బ్రాడీ ప్రైస్ (275 కేజీలు) రజతం, జపాన్‌కు చెందిన రుయుచి ఇనుబుషి (255 కేజీలు) కాంస్యం సాధించారు. డెడ్‌లిఫ్ట్ విభాగంలోనూ వంశీ 255 కేజీల బరువు ఎత్తి రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇందులో బ్రాడీ ప్రైస్, మంగోలియాకు చెందిన ఊగన్‌బట్ బాత్సఖ్ చెరో 235 కేజీలు ఎత్తి సంయుక్తంగా రజతం గెలుచుకోగా, ఇనుబుషి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
బెంచ్ ప్రెస్ విభాగంలో వంశీ 145 కేజీలు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. ఇందులో బ్రాడీ ప్రైస్ (187.5 కేజీలు), ఇనుబుషి (180 కేజీలు) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 687.5 కేజీల బరువు ఎత్తడం ద్వారా వంశీ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రాడీ ప్రైస్ (697.5 కేజీలు) స్వర్ణం గెలవగా, ఇనుబుషి (630 కేజీలు) కాంస్యం సాధించాడు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మోదెం వంశీ, ప్రస్తుతం హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ (LB) స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







