షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్‌తో పోలీసుల భాగస్వామ్యం
- August 19, 2026
షార్జా: వాహనదారులకు ట్రాఫిక్ సేవలను మరింత సులభతరం చేసేందుకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నూన్‌తో కలిసి వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సేవను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
డిజిటల్ మార్పిడి, వినియోగదారుల సౌకర్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ సేవను రూపొందించారు. నంబర్ ప్లేట్లను భౌతికంగా సమర్పించాల్సిన లైసెన్సింగ్ లావాదేవీల కోసం ఇకపై వాహనదారులు తప్పనిసరిగా సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఇంటి వద్ద నుంచే ప్లేట్ల సేకరణ
కొత్త విధానంలో వినియోగదారులు MOI UAE యాప్ లేదా ట్రాఫిక్, లైసెన్సింగ్ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత నూన్ ప్రతినిధి నేరుగా వినియోగదారుడి వద్దకు వెళ్లి వాహన నంబర్ ప్లేట్లను సేకరిస్తారు. అనంతరం వాటిని షార్జా పోలీస్‌కు చెందిన వాహనాలు, డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగానికి అందజేస్తారు.
ప్లేట్లు విభాగానికి చేరిన తర్వాత వినియోగదారుడికి SMS ద్వారా ధృవీకరణ సందేశం అందుతుంది. దీంతో సేవా కేంద్రాన్ని సందర్శించకుండానే మిగిలిన లావాదేవీని ఎలక్ట్రానిక్ విధానంలో పూర్తి చేసుకోవచ్చు.
సమయం, శ్రమ ఆదా
భౌతికంగా నంబర్ ప్లేట్లను తరలించే ప్రక్రియను డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ సంబంధిత లావాదేవీలకు పట్టే సమయం, వినియోగదారుల శ్రమ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
షార్జా పోలీస్–నూన్ భాగస్వామ్యం ద్వారా సాంకేతికత, లాజిస్టిక్స్‌ను సమర్థంగా అనుసంధానించి వేగవంతమైన, సౌకర్యవంతమైన ట్రాఫిక్ సేవలను అందించే దిశగా మరో అడుగు పడినట్లైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!







