ఇండిగో వెబ్‌సైట్ క్రాష్.. ఆన్‌లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- August 19, 2026
న్యూ ఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన ఆన్‌లైన్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఇండిగో ప్రధాన రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బట్లు ఎదుర్కొన్నారు.
వెబ్‌సైట్, యాప్ స్తంభించిపోవడంతో:
ప్రయాణికులు కొత్త టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణానికి ముందుగా చేయావలసిన వెబ్ చెక్-ఇన్ (Web Check-in) ప్రక్రియను పూర్తి చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాల సెర్చ్‌లో “నో డేటా అవైలబుల్” అనే మెసేజ్‌లు దర్శనమిచ్చాయి. ఎక్స్ వేదికగా ప్రయాణికుల ఆగ్రహం. సర్వర్ డౌన్ కావడంతో చాలా మంది తాము ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా సరైన స్పందన రాలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
విమాన సర్వీసులపై ప్రభావం లేదని వెల్లడి.. ఆన్‌లైన్ సర్వర్లలో అంతరాయం ఏర్పడినప్పటికీ, విమానాశ్రయాల్లోని గ్రౌండ్ ఆపరేషన్స్ మరియు విమానాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులకు మాన్యువల్ చెక్-ఇన్ (Manual Check-in) సౌకర్యాన్ని అందించారు.
ఈ సాంకేతిక సమస్యపై స్పందించిన ఇండిగో యాజమాన్యం, తమ కోర్ రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లో తాత్కాలిక సమస్య తలెత్తిందని ధృవీకరించింది. టెక్నికల్ టీమ్‌లు భాగస్వామ్య సంస్థలతో కలిసి సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాయని తెలిపింది. అత్యవసర ప్రయాణికులు తమ కాంటాక్ట్ సెంటర్‌ను సంప్రదించాలని, కొద్దిసేపటి తర్వాత యాప్ లేదా వెబ్‌సైట్‌ను మళ్లీ ప్రయత్నించాలని సూచించింది. దేశీయ విమాన మార్కెట్లో 65 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో డిజిటల్ సేవలు ఇలా అకస్మాత్తుగా నిలిచిపోవడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







