వెంకటేశ్-కల్యాణ్‌రామ్ కొత్త సినిమా టైటిల్ ‘జనవరి 12 విడుదల’
- August 19, 2026
టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి ఎట్టకేలకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు వర్కింగ్ టైటిల్స్ #VenkyAnil5 మరియు #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ అత్యంత విభిన్నంగా ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ప్రత్యేక వీడియో
షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ఓ వినూత్నమైన వీడియో ద్వారా వెల్లడించింది. ప్రముఖ దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ప్రత్యేక నివాళిగా క్లాసిక్ కామెడీ మూవీ ‘అప్పుల అప్పారావు’లోని ఒక ప్రసిద్ధ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఈ వీడియోను ప్రారంభించారు. అనిల్ రావిపూడికి ఈవీవీ సినిమాలే స్ఫూర్తి అని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార చిత్రంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి తదితరులు అనిల్ రావిపూడిని అసలు సినిమా టైటిల్ ఏంటని ప్రశ్నిస్తారు. ఎలాంటి తడబాటు లేకుండా ఆయన ‘జనవరి 12 విడుదల’ అని సమాధానం ఇస్తారు. దీంతో నటీనటులు తాము అడుగుతోంది సినిమా టైటిల్ గురించని, విడుదల తేదీ గురించి కాదని అయోమయానికి గురవుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని దర్శకుడు వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా వెంకటేశ్ ఫస్ట్‌లుక్
కొద్ది రోజుల క్రితం సినిమా పరిశ్రమలో వెంకటేశ్ హీరోగా 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో వెంకటేశ్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డి’ పాత్రలో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించారు. భారత సైన్యంలో పనిచేసే ఈ ఆర్మీ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను సురక్షితంగా రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఆర్మీ దుస్తులు ధరించి, సన్‌గ్లాసెస్ పెట్టుకుని, ఒక కారు పక్కన ఆయన నిలబడిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా అగ్ర నటి కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు. వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌ల కాంబినేషన్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీ.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఏఎస్ ప్రకాశ్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







