కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- August 22, 2026
కువైట్ సిటీ: డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులో కువైట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మాదక, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారుల ప్రకారం.. నిందితులు అక్రమంగా సంపాదించిన డబ్బును దాచిపెట్టి, దానితో బంగారం, ఖరీదైన వాచీల వంటి అధిక విలువైన ఆస్తులుగా మార్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ ఆపరేషన్‌లో నిందితుల వద్ద నుంచి KD 40,000 నగదుతోపాటు సుమారు KD 50,000 విలువైన 4 ఖరీదైన వాచీలు, సుమారు 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వాచీలు, డ్రగ్స్ తదితర వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







