తమిళ సినిమాల పై కీలక నిర్ణయం..
- August 22, 2026
చెన్నై: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో థియేటర్లు మరియు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు తమిళనాడు యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక కీలక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి కొత్త తమిళ సినిమాల థియేట్రికల్ విడుదలతో పాటు, అన్ని రకాల సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఓటీటీ విడుదలల పై ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య రగులుతున్న వివాదం
సినిమా ప్రదర్శనల విషయంలో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కఠినమైన నిబంధనను తెరపైకి తెచ్చారు. థియేటర్లలో సినిమా విడుదలైన కనీసం 8 వారాల (రెండు నెలలు) గడువు ముగిసిన తర్వాతే, ఆ సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ నిబంధనను చిత్ర నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడే నిర్మాతలకి ఈ గడువు నిబంధన తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని భావిస్తుండటంతో, ఇరువర్గాల మధ్య ఈ పట్టుదల సమ్మె రూపంలో తీవ్ర రూపం దాల్చింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







