ముంబైలో 22 అడుగుల గణేశ్ విగ్రహం మీద పడి ఇద్దరి మృతి
- August 23, 2026
ముంబై: మహారాష్ట్రలోని ముంబై భులేశ్వర్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకల స్వాగతోత్సవంలో ఊహించని విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ‘భులేశ్వర్‌చా రాజా’ మండపానికి తరలిస్తున్న 22 అడుగుల భారీ గణపతి విగ్రహం ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి జై అంబే చౌక్ సమీపంలో శోభాయాత్ర అత్యంత వేడుకగా సాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విగ్రహానికి మద్దతుగా ఉన్న ఐరన్ ఫ్రేమ్ వెల్డింగ్ ఊడిపోవడం లేదా బోల్టులు వదులుకావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
క్షతగాత్రులకు చికిత్స: పండుగ వేళ శోకసంద్రంలో భులేశ్వర్
ప్రమాదం జరగగానే అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉండగా, వారందరినీ స్థానిక జి.టి., జె.జె. ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందన వైద్యులు వెల్లడించారు. వినాయక చవితి పండుగకు ముందే జరిగిన ఈ విషాదం ముంబైలోని భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఊరేగింపుల్లో భారీ విగ్రహాల భద్రతా ప్రమాణాలపై, రోడ్డు సౌకర్యాలపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







