యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- August 23, 2026
యూట్యూబ్..ప్రపంచంలో తిరుగులేదు.. ఇప్పటివరకు వీడియో స్ట్రీమింగ్ ప్రపంచంలో గట్టి పోటీ ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు పోటీగా చైనా నుంచి ఓ కొత్త యాప్ వచ్చేసింది. చైనాలో ఇప్పటికే భారీగా పాపులర్ అయిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి (Bilibili) అంతర్జాతీయ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది.
నెలకు సుమారు 376 మిలియన్ల యాక్టివ్ యూజర్లతో ఈ ప్లాట్‌ఫామ్ లేటెస్టుగా గ్లోబల్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అతి త్వరలో iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
యూట్యూబ్‌తో పోటీ ఎలా?
యూట్యూబ్‌కు ఈ చైనా బిలిబిలికి పోటీ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.. యూట్యూబ్‌లాగే బిలిబిలిలో కూడా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా జెన్-జెడ్, యువత, క్రియేటర్లను ఆకర్షించడంపై కంపెనీ ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ కంటెంట్‌ను పెంచడం, లోకల్ ఆడియోన్స్ అనుగుణంగా కంటెంట్‌ను అందించడం, సైన్‌అప్ ప్రాసెస్ ఈజీ చేయడం వంటి మార్పులతో గ్లోబల్ మార్కెట్‌లోకి వస్తోంది.
ఫస్ట్ కంటెంట్‌తోనే మానిటైజేషన్:
క్రియేటర్ల విషయంలో బిలిబిలి మరింత ఆసక్తికరమైన ఆఫర్ ముందుకు తెస్తోంది. ఫస్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచే సంపాదించే అవకాశం కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. యూట్యూబ్‌లో ఉన్నట్లుగా మానిటైజేషన్‌కు నిర్దిష్ట అర్హతలు ఇందులో లేవు. కొత్త క్రియేటర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.అంతర్జాతీయ క్రియేటర్లను కూడా ప్లాట్‌ఫామ్‌లోకి రప్పించేందుకు కంపెనీ తెగ ట్రై చేస్తోంది.
అయితే అసలు సవాలు ఇక్కడే..ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యూజర్ బేస్, క్రియేటర్ ఎకానమీగా పేరొందిన యూట్యూబ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. యూట్యూబ్ నుంచి బిలిబిలికి తీవ్రమైన పోటీ ఉంటుంది. అదనంగా కంటెంట్ కంట్రోలింగ్ డేటా స్టోరేజీ, వివిధ దేశాల నిబంధనలు బిలిబిలికి పెద్ద సవాళ్లుగా మారే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







