'రంభ ఊర్వశి మేనక' హిలేరియస్ ట్రైలర్
- August 24, 2026
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. పౌరాణిక కథలు, గ్రామీణ హాస్యం, వినోదాత్మకమైన అంశాలతో అలరించనుంది. కింగ్ నాగార్జున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
సూరి(అల్లరి నరేష్) మొక్కుబడులతో భూలోకానికి దిగివచ్చిన రంభ, ఊర్వశి, మేనకలు.. తమ దివ్య శక్తులను కోల్పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ముగ్గురు అప్సరసలు తన ఇంట్లో ఉండటంతో సూరికి ఎదురయ్యే ఇబ్బందులు, అతడి ప్రేయసి గొడవ, పోలీసుల విచారణ, మరోవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. ఇలా వరుస సమస్యలతో కథలో ఎంటర్టైమెంట్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
ట్రైలర్‌ను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. ముఖ్యంగా అల్లరి నరేష్, నరేష్ వీకే మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘లవ్ యూ బచ్చెస్’ డైలాగ్‌ను కూడా ఫన్నీగా ఉపయోగించారు. ‘ఓజీ’లోని జపనీస్ డైలాగ్‌ను సరదాగా వాడిన విధానం ట్రైలర్‌కు మంచి కామెడీ ఎండింగ్ ఇచ్చింది.
ట్రైలర్‌లో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అమాయకత్వం, ఎనర్జీ, కామెడీ కలగలిపిన ఆయన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సురభి కథానాయికగా నటించగా, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పూయించారు. నరేష్ వీకే కూడా అల్లరి నరేష్‌తో కలిసి వచ్చే సన్నివేశాల్లో మెప్పించారు. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముగ్గురు అప్సరసలుగా అలరించారు.
రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చిత్రానికి కలర్‌ఫుల్ లుక్ తీసుకొచ్చింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ ఫాంటసీ ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దగా, చైతన్ భరద్వాజ్ సంగీతం ట్రైలర్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్‌కు ఎలివేట్ చేసింది.
ట్రైలర్ చూస్తుంటే ‘రంభ ఊర్వశి మేనక’ పల్లెటూరి హ్యూమర్, పురాణ నేపథ్యం, ఫాంటసీ అంశాలను కలిపిన ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. ముఖ్యంగా కామెడీ జానర్‌లో అల్లరి నరేష్ బలాన్ని మరోసారి పూర్తిగా ఉపయోగించుకున్న సినిమాగా అలరించబోతుంది.
తారాగణం: అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపి: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







