సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- August 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. అల్హదీథా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఓ ట్రక్కులో తరలిస్తున్న పప్పు ధాన్యాల సరుకులో దాచిన 19,50,581 యాంఫెటమైన్ పిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికార ప్రతినిధి హమూద్ అల్ హర్బీ తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దు వద్ద సాధారణ కస్టమ్స్ తనిఖీల్లో భాగంగా ట్రక్కును భద్రతా సాంకేతిక పరికరాలు, ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ విధానాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులోని సరుకును అధికారికంగా పప్పు ధాన్యాలుగా ప్రకటించినప్పటికీ, వాటి మధ్యలో భారీ మొత్తంలో యాంఫెటమైన్ పిల్స్ ను అక్రమంగా దాచినట్లు అధికారులు గుర్తించారు.
దేశంలోకి, బయటకు వెళ్లే అన్ని రకాల సరుకులపై కస్టమ్స్ నియంత్రణలను మరింత కఠినతరం చేస్తున్నామని ZATCA తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
సమాచారం ఇస్తే నగదు బహుమతి
దేశంలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ZATCA ప్రజలను కోరింది. అధికారిక భద్రతా సమాచార మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని పూర్తి గోప్యతతో నిర్వహిస్తామని తెలిపింది. సమాచారం నిజమని నిర్ధారణ అయితే, సమాచారం అందించిన వారికి ఆర్థిక బహుమతులు కూడా అందించే అవకాశం ఉందని ZATCA వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







