ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- August 29, 2026
దోహా: ఖతార్‌లో అధిక ఉష్ణోగ్రతల మధ్య విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో.. వేడి తీవ్రత నుంచి పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని కార్మిక మంత్రిత్వ శాఖ సూచించింది.
సోషల్ మీడియాలో విడుదల చేసిన అవగాహన మేసేజ్ లో.. పిల్లలను ఎండ నుంచి రక్షించడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఉమ్మడి బాధ్యత అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యార్థులు రోజును తగినంత నీరు తాగడంతో ప్రారంభించేలా చూడాలని సూచించింది.
అలాగే ఎక్కువసేపు నేరుగా ఎండలో నిలబడకుండా ఉండాల్సిన ప్రాధాన్యతను పిల్లలకు వివరించాలని తెలిపింది. విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో.. స్కూల్ బస్సుల కోసం వేచి ఉండే విద్యార్థులు నేరుగా ఎండలో నిలబడకుండా నీడ ఉన్న ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా నీరు తాగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సాధారణ జాగ్రత్తలను పాటించడం ద్వారా విద్యార్థులు పాఠశాలలకు ఉత్సాహంగా, సురక్షితంగా తిరిగి వెళ్లవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే హీట్ స్ట్రెస్ ముప్పును తగ్గించవచ్చని పేర్కొంది.
ఈ అవగాహన కార్యక్రమానికి “Heat fades… Safety stays.” అనే దానిని ప్రచార నినాదంగా ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







