‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ
- August 30, 2026
సూపర్‌స్టార్ బాద్షా కిచ్చా సుదీప్, అనూప్ భండారి, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ
సూపర్‌స్టార్ బాద్షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది.
సుదీప్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2, 2026న ఈ ప్రచార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ మంచుతో నిండిన ల్యాండ్‌స్కేప్స్, ఎత్తైన మంచు నిర్మాణాలతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ఈ అనౌన్స్మెంట్లో ముఖ్యంగా ఆకట్టుకునే అంశం మేకర్స్ రూపొందించిన లాంగ్-టర్మ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. 2027 తొలి క్యార్టర్లో టీజర్ విడుదల చేయనున్నారు. అనంతరం 2027 మూడో క్యార్టర్లో భారీ ప్రమోషనల్ ఫేజ్‌ను ప్రారంభించి, ట్రైలర్, పాటలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 2027 చివరి క్యార్టర్లో సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
చాలా ముందుగానే రూపొందించిన ఈ ప్రమోషనల్ టైమ్‌లైన్ ‘బిల్లా రంగా బాషా’కు ప్రత్యేకమైన ప్రమోషనల్ విధానాన్ని అందిస్తోంది. ఎక్కువ కాలం పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రమంగా పెంచేలా మేకర్స్ ఈ ప్లాన్‌ను రూపొందించారు.
విజయవంతమైన ‘విక్రాంత్ రోణా’ తర్వాత సుదీప్, అనూప్ భండారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘బిల్లా రంగా బాషా’. దర్శకుడు మరోసారి విస్తృతమైన సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. సుదీప్ ఈ పీరియడ్-యాక్షన్ అడ్వెంచర్‌లో లార్జర్-దేన్-లైఫ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఈ గ్రాండ్ వరల్డ్‌కు పరిచయాన్ని అందించి, సినిమాపై భారీ ఆసక్తిని క్రియేట్ చేసింది.
‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ అన్ని దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీలోనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
నటీనటులు: కిచ్చా సుదీప్
సాంకేతిక సిబ్బంది:
రచన దర్శకత్వం: అనూప్ భండారి
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







