‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

- August 30, 2026 , by Maagulf
‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ లో ఫన్ లవ్ ఎంటర్ టైమెంట్ అదిరిపోయింది.  నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో కనిపించారు. 2005లో ఆన్‌లైన్‌లో క్యాసెట్ పాటలను కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేస్తూ తనకు తానే ‘MP3King’ అనే పేరు పెట్టుకున్న జస్టిన్ పాత్రలో పరిచయం కావడం ఆకట్టుకుంది. మమితా బైజు కాలేజీ విద్యార్థినిగా, గిటార్ వాయిస్తూ ఆల్టర్నేటివ్ రాక్ మ్యూజిక్‌ను ఇష్టపడే అమ్మాయిగాకనిపించింది.  

నివిన్ పౌలీ, మమితా బైజు లైట్ హార్టెడ్ హ్యూమర్, న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి. గిరీశ్ ఏడీ తనదైన కంఫర్ట్, నాస్టాల్జిక్ టచ్‌తో కథను తెరకెక్కించారు.  ప్రేమ, హ్యూమర్, నాస్టాల్జియా, కమ్యూనిటీ డ్రామాను కలిపిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

నటీనటులు: నివిన్ పౌలీ, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్, శ్యామ్ మోహన్, షమీర్ ఖాన్, స్రిందా, పార్వతి అయ్యప్పదాస్, మీనాక్షి రవీంద్రన్, శ్రీరంజిని, వినీత్ విశ్వం, బిందు పనికర్, వెట్టుకిలి మంజు, జయంతి సనత్ శివరాజ్

సమర్పణ: మైత్రీ మూవీ రిలీజ్ & ఫ్యూచర్ రన్అప్ ఫిల్మ్స్  
దర్శకత్వం: గిరీష్ ఎ డి
నిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్
రచన: గిరీష్ ఎ డి, కిరణ్ జోసీ
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు
ఎడిటర్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com