దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- August 30, 2026
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB)లో ప్రయాణికుల భద్రతా తనిఖీలను మరింత వేగవంతం చేసేందుకు ఆధునిక స్కానింగ్ సాంకేతికతను దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త స్కానర్లతో ప్రయాణికులు ఇకపై బ్యాగుల నుంచి ల్యాప్‌టాప్‌లు, లిక్విడ్స్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే షూస్, బెల్ట్‌లు తొలగించాల్సిన అవసరం కూడా తగ్గనుంది.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ.. కొత్త భద్రతా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికుల తనిఖీ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా, సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు.
“లిక్విడ్స్ లేదా ల్యాప్‌టాప్‌లను బ్యాగుల నుంచి బయటకు తీయాల్సిన అవసరం లేకుండా కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బెల్ట్‌లు, షూస్ తొలగించే పాత విధానం క్రమంగా గతంగా మారనుంది” అని ఆయన పేర్కొన్నారు.
మూడు టెర్మినళ్లలో కొత్త సాంకేతికత
ప్రయాణికుల రద్దీని తగ్గించి, భద్రతా తనిఖీలను వేగవంతం చేయడానికి దుబాయ్ ఇంటర్నేషనల్‌లో గత ఏడాది నుంచే ఈ కొత్త సాంకేతికతను దశలవారీగా అమలు చేస్తున్నారు.
2025 మేలో దుబాయ్ ఏవియేషన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్, DXBలోని మూడు టెర్మినళ్లలో ఆధునిక చెక్‌పాయింట్ స్క్రీనింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు స్మిత్స్ డిటెక్షన్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది.
ప్రస్తుతం కొత్త యంత్రాల ఏర్పాటు, టెర్మినళ్లలో అవసరమైన ఫ్లోరింగ్ మార్పులు వంటి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం పాత పరికరాలను క్రమంగా మార్చి.. భవిష్యత్తులో DXBలోని ప్రయాణికులందరికీ ఒకే విధమైన వేగవంతమైన తనిఖీ సదుపాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
3D ఇమేజింగ్‌తో వేగవంతమైన తనిఖీలు
కొత్త తరం స్కానర్లు హై-రిజల్యూషన్ 3D ఇమేజింగ్ సాంకేతికతతో పనిచేస్తాయి. దీంతో ప్రయాణికుల బ్యాగుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, లిక్విడ్స్‌ను బయటకు తీయకుండానే భద్రతా తనిఖీలు నిర్వహించవచ్చు.
దీంతో తనిఖీ ప్రక్రియలో సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణికుల రద్దీని మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
కొత్త ఇమిగ్రేషన్ సాంకేతికతను EmaratTech అందిస్తుండగా.. భద్రతా తనిఖీ యంత్రాలను Smiths Detection సరఫరా చేస్తోంది.
టెర్మినల్-1లో కొత్త రిటైల్ ఏరియా
ఇదిలా ఉండగా, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1లో పునరుద్ధరించిన కొత్త హ్యామర్‌హెడ్ ప్రాంతాన్ని త్వరలో తిరిగి ప్రారంభించనున్నట్లు పాల్ గ్రిఫిత్స్ తెలిపారు.
అక్కడ కొత్త రిటైల్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ బ్రాండ్లు, కొత్త షాపింగ్ అనుభవం ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని చెప్పారు.
DXBలో మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యాలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







