అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- August 30, 2026
అబుదాబి: యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2026 అబుదాబి అంతర్జాతీయ వేట, గుర్రపు స్వారీ ప్రదర్శన (ADIHEX)ను సందర్శించారు.
అబుదాబిలోని ADNEC సెంటర్లో జరుగుతున్న ఈ ప్రదర్శన సెప్టెంబర్ 6 వరకు కొనసాగనుంది. సందర్శన సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ ప్రదర్శనలోని వివిధ విభాగాలను పరిశీలించారు.
ADIHEX అంతర్జాతీయ స్థాయిలో సాధించిన ప్రతిష్ఠను ఆయన ప్రశంసించారు. యూఏఈకి చెందిన ప్రామాణికమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యంగా యువతలో తమ దేశ చరిత్ర, సంప్రదాయాలు, వారసత్వంపై ఆసక్తిని పెంపొందించడంలో ADIHEX వంటి కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అన్నారు.
వేట, గుర్రపు స్వారీతో పాటు యూఏఈ సంప్రదాయ జీవన విధానం, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలను ప్రదర్శించే ADIHEXకు ప్రతి ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఈ ప్రదర్శన యూఏఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చేరవేసే వేదికగా కూడా నిలుస్తోంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







