#NBK111 సెప్టెంబర్ 6న టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
- August 31, 2026
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ మ్యాసీవ్ యాక్షనర్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు.
#NBK111 నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని అంచనాలని పెంచుతోంది.
#NBK111 లో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, రామ్ లక్ష్మణ్, రవి వర్మ , వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్ థమన్
DOP: అరవింద్ S కశ్యప్ ISC
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవివర్మ, వ్వెంకట్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







