కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- September 01, 2026
కువైట్: కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై కీలక ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు ట్రక్కుల ప్రయాణానికి నిర్దిష్ట సమయాల్లో నిషేధం విధిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది.
సెప్టెంబర్ 1 నుంచి 2027 జూన్ 14 వరకు ట్రక్కులు అన్ని రహదారులపై కింది సమయాల్లో తిరగడానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఉదయం: 6:30 గంటల నుంచి 9:00 గంటల వరకు, మధ్యాహ్నం: 12:30 గంటల నుంచి 3:30 గంటల వరకు, 2027 జూన్ 15 నుంచి నిబంధనల్లో మార్పులు ఉంటాయని ప్రకటించారు.
ఇక 2027 జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు ట్రక్కులపై మధ్యాహ్నం: 12:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మాత్రమే ఆంక్షలు కొనసాగుతాయి. ట్రాఫిక్ రద్దీని సజావుగా నిర్వహించడంతో పాటు రహదారులపై భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్ యజమానులు, డ్రైవర్లు నిర్ణయించిన సమయాలను తప్పనిసరిగా పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సూచించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







