భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- September 01, 2026
అజ్మాన్: భారత పర్యాటక మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా అజ్మాన్ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అజ్మాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కల్చర్ అండ్ మీడియా కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
‘అజ్మాన్ పార్టనర్ టూరిజం గ్రోత్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్’ సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 1 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం కింద అర్హత కలిగిన ట్రావెల్ ఏజెంట్లకు అజ్మాన్‌కు సంబంధించిన ధృవీకరించిన ప్రయాణికుల బుకింగ్స్ ఆధారంగా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనున్నారు.
భారత ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు అజ్మాన్ను తమ టూరిజం ప్యాకేజీల్లో మరింతగా చేర్చుకునేలా ప్రోత్సహించడం, అజ్మాన్ పర్యాటక ప్రచారాన్ని పెంచడం, సందర్శకుల సంఖ్యను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
మూడు నగరాల్లో రోడ్‌షో
ఈ కొత్త కార్యక్రమాన్ని ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో నిర్వహించిన మూడు నగరాల ప్రమోషనల్ రోడ్‌షో సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక రంగ భాగస్వాములు పాల్గొని B2B సమావేశాలు, అజ్మాన్ పర్యాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
భారత ట్రావెల్ ట్రేడ్ భాగస్వాములతో వాణిజ్య సహకారానికి కొత్త అవకాశాలను అన్వేషించడంతో పాటు, అజ్మాన్‌లోని పర్యాటక ఆకర్షణలను ఈ రోడ్‌షోలో అధికారులు వివరించారు.
అజ్మాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కల్చర్ అండ్ మీడియా డైరెక్టర్ జనరల్ మహ్మూద్ ఖలీల్ అల్ హష్మీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సందర్శకుల మార్కెట్‌ను విస్తరించుకోవడం, ప్రపంచ పర్యాటక రంగంలో అజ్మాన్ స్థాయిని పెంచుకోవడంలో భారత్ కీలక మార్కెట్ అని అన్నారు.
భారత ట్రావెల్ భాగస్వాములు తమ టూరిజం పోర్ట్‌ఫోలియోలో అజ్మాన్‌కు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా, బుకింగ్స్ పెంచేలా ఈ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలిపారు.
భారతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పర్యాటక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తున్నట్లు అల్ హష్మీ తెలిపారు.
భారతీయులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా అజ్మాన్
ఇంట్రెపిడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నీతి శర్మ మాట్లాడుతూ.. యూఏఈలో ప్రత్యేకమైన అనుభవాలను పొందేందుకు భారతీయ ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
సంస్కృతి, వారసత్వం, వినోదం, ప్రకృతి, కుటుంబ అనుభవాలు, ఆతిథ్య రంగాల సమ్మేళనంతో భారతీయ పర్యాటకులకు అజ్మాన్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రయాణ సీజన్లో ఈ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అజ్మాన్‌కు మరింత ప్రాచుర్యం తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.
అజ్మాన్ భారత్ వ్యూహం ‘అజ్మాన్ విజన్ 2030’లో భాగంగా అమలు చేస్తున్న విస్తృత పర్యాటక ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ ట్రేడ్ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లీజర్, నేచర్, ఫ్యామిలీ టూరిజం, హాస్పిటాలిటీ, బిజినెస్ ఈవెంట్స్ వంటి విభాగాల్లో అజ్మాన్ పర్యాటక అవకాశాలను విస్తరించనున్నట్లు డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







